Tollywood: లక్ష్మీస్ ఎన్టీఆర్ లో ‘వెన్నుపోటు’ పాట ఫస్ట్ లుక్ రిలీజ్.. తేదీని ప్రకటించిన రామ్ గోపాల్ వర్మ!

  • ఎన్టీఆర్ వ్యక్తిగత జీవితం ఆధారంగా సినిమా
  • బాలయ్య హీరోగా సినిమా తీస్తున్న క్రిష్
  • ట్విట్టర్ లో ప్రకటించిన రామ్ గోపాల్ వర్మ

ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి ఎంటరైన దగ్గర నుంచి నడిచిన కథను 'లక్ష్మీస్ ఎన్టీఆర్' పేరుతో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాలో ఎన్టీఆర్ వ్యక్తిగత జీవితాన్ని ప్రధానంగా చూపుతానని రామ్ గోపాల్ వర్మ ఇప్పటికే ప్రకటించారు. ప్రస్తుతం దర్శకుడు క్రిష్ ఎన్టీఆర్ జీవితాన్ని కథానాయకుడు, మహానాయకుడు పేరుతో రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు.

 ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ లో ఈ రోజు స్పందించారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో ‘వెన్నుపోటు’ పాట ఫస్ట్ లుక్ ను ఈ నెల 21న సాయంత్రం 4 గంటలకు రిలీజ్ చేస్తానని ప్రకటించారు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న కథానాయకుడు ట్రైలర్ కూడా ఇదే రోజు విడుదల కానుంది. కాగా, రామ్ గోపాల్ వర్మ ట్వీట్ పై నెటిజన్లు ఓ రేంజ్ లో జోకులు వేస్తున్నారు.

Tollywood
ntr
lakshmis ntr
personal life
song
first look
december 21
  • Loading...

More Telugu News