kavitha: బీజేపీ, కాంగ్రెస్ లు మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడ్డాయి: కవిత

  • పార్లమెంటు సమావేశాలు ప్రారంభమై ఏడు రోజులు గడుస్తున్నాయి
  • ఇంత వరకు ఒక్క అంశంపై కూడా చర్చ జరగలేదు
  • పార్లమెంటులో మళ్లీ పాత కథే పునరావృతమవుతోంది

పార్లమెంటు సమావేశాలు ప్రారంభమై ఏడు రోజులు గుడుస్తున్నా... ఇప్పటి వరకు ఏ ఒక్క అంశంపైనా చర్చ జరగలేదని టీఆర్ఎస్ ఎంపీ కవిత అసహనం వ్యక్తం చేశారు. ప్రతి రోజు సభా సమయాన్ని వృథా చేస్తున్నారని మండిపడ్డారు. రోజు మాత్రమే మారిందని... పార్లమెంటులో మళ్లీ పాత కథే పునరావృతమవుతోందని అన్నారు.

సభ సజావుగా సాగకుండా బీజేపీ, కాంగ్రెస్ లు మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడ్డాయని ఆరోపించారు. ఉభయసభలు ప్రారంభమైన కాసేపటికే వాయిదా పడుతున్న నేపథ్యంలో, కవిత ఈ మేరకు ట్వీట్ చేశారు. రాఫెల్ డీల్ అంశం నేపథ్యంలో, ఉభయసభల్లో గందరగోళం నెలకొంటున్న సంగతి తెలిసందే. ఈ గోల మధ్య ఉభయసభలు వాయిదా పడుతున్నాయి. 

kavitha
TRS
parliament
sessions
  • Loading...

More Telugu News