Etela Rajender: ప్రజల నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వమ్ము చేయం: టీఆర్ఎస్ నేత ఈటల రాజేందర్‌

  • ప్రజల నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వమ్ముచేయం
  • స్థానిక సంస్థల ఎన్నికల్లో కష్టపడే వారికే అవకాశం
  • సీఎం కేసీఆర్‌ అభీష్టం మేరకే మంత్రివర్గం కూర్పు

ప్రజలు తమపై నమ్మకం పెట్టుకుని ఘన విజయాన్ని అందించారని, వారి నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వమ్ము చేయమని మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు. కరీంనగర్ లో ఆయన మాట్లాడుతూ  రాష్ట్రంలో వ్యవసాయాధారిత పరిశ్రమలకు ప్రోత్సాహం ఇవ్వనున్నట్లు తెలిపారు.

త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని భావిస్తున్నానని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభీష్టం మేరకే కూర్పు ఉంటుందని తెలిపారు. త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో కష్టపడే వారికి తప్పక గుర్తింపు ఉంటుందని చెప్పారు. అదే సమయంలో అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి ద్రోహం చేసిన వారు ఏ స్థాయిలో ఉన్నా విడిచిపెట్టేది లేదని తెలిపారు.

Etela Rajender
Karimnagar District
agricultural industries
  • Loading...

More Telugu News