modi: మోదీ ప్రభుత్వంపై టీఆర్ఎస్ ఎంపీల విమర్శలు

  • బీజేపీది మాటల ప్రభుత్వమే తప్ప.. చేతల ప్రభుత్వం కాదు
  • రాష్ట్రానికి చెప్పుకోదగ్గ ఒక్క ప్రాజెక్టును కూడా ఇవ్వలేదు
  • తెలంగాణకు ప్రత్యేకంగా ఇచ్చిందేమీ లేదు

కేంద్రంలోని మోదీ సర్కారుపై టీఆర్ఎస్ ఎంపీలు విమర్శల వర్షం కురిపించారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ ఎంపీలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ జితేందర్ రెడ్డి మాట్లాడుతూ, బీజేపీ సర్కారుది మాటల ప్రభుత్వమే తప్ప, చేతల ప్రభుత్వంగా కనిపించడం లేదని అన్నారు. తెలంగాణకు చెప్పుకోదగ్గ ఒక్క ప్రాజెక్టును కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ఈ సమావేశానికి ముందు ఇద్దరు కేంద్ర మంత్రులను కలసి విభజన హామీలను అమలు చేయాలంటూ వినతి పత్రం ఇచ్చారు.

దీనిపై జితేందర్ రెడ్డి మాట్లాడుతూ, చట్ట పరంగా తెలంగాణకు దక్కాల్సిన వాటిపై కేంద్రానికి విన్నవించామని చెప్పారు. హైకోర్టు విభజన, కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టుల గురించి మరోసారి గుర్తు చేశామని తెలిపారు. ఇతర రాష్ట్రాలకు ఇస్తున్నట్టే తెలంగాణకు కూడా కేంద్రం ఇస్తోందని... ప్రత్యేకంగా ఇచ్చిందేమీ లేదని అన్నారు. కవిత మాట్లాడుతూ, పార్లమెంటు ఎన్నికల్లో టీఆర్ఎస్ 16 సీట్లను కైవసం చేసుకుంటుందని చెప్పారు. వినోద్ మాట్లాడుతూ, పెండింగ్ అంశాల సాధన కోసం కేంద్ర ప్రభుత్వంపై టీఆర్ఎస్ ఎంపీలమంతా ఒత్తిడి పెంచామని తెలిపారు. 

  • Loading...

More Telugu News