Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 2026 వరకూ అసెంబ్లీ సీట్లను పెంచలేం.. తేల్చిచెప్పిన కేంద్రం!
- 2026 తర్వాత జనాభా లెక్కల ప్రకారం పెంపు
- రాజ్యాంగ నిబంధనల మేరకే నిర్ణయం
- 12 షెడ్యూల్ లోని హామీలను పూర్తిచేశాం
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అసెంబ్లీ సీట్ల పెంపు ఇప్పట్లో సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 170(3) ప్రకారం 2026 తర్వాత జనాభా లెక్కల ఆధారంగానే అసెంబ్లీ స్థానాల పెంపు ఉంటుందని వెల్లడించింది. రాజ్యసభలో టీడీపీ నేత, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్ రాజ్ గంగారాం ఈ మేరకు జవాబిచ్చారు.
ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత జనాభాకు అనుగుణంగా ఏపీలో ప్రస్తుతం ఉన్న స్థానాలను 175 నుంచి 225 పెంచాలని విభజన చట్టంలో పేర్కొన్నారు. అలాగే తెలంగాణలో ఉన్న 119 స్థానాలను 153కు పెంచాలని విభజన చట్టంలో పొందుపరిచారు. ఈ సందర్భంగా టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన మరో ప్రశ్నకు స్పందిస్తూ.. 2014 పునర్విభన చట్టంలోని 12 షెడ్యూల్ లో ఇచ్చిన హామీలను దాదాపుగా పూర్తిచేశామని కేంద్రం జవాబిచ్చింది.