mp vinod: మూడు రోజులు జనాలను నిద్రపోనివ్వలేదు: లగడపాటిపై ఎంపీ వినోద్ ఫైర్

  • విషపూరిత సర్వేలతో నిద్రలేని రాత్రులను మిగిల్చారు
  • ఓటమి బాధ్యత నుంచి ఉత్తమ్ తప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు
  • ఓటమికి చంద్రబాబే కారణమని కుంటి సాకులు చెబుతున్నారు

మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పై టీఆర్ఎస్ ఎంపీ వినోద్ మండిపడ్డారు. రాజగోపాల్ విషపూరిత సర్వేల వల్ల తెలంగాణ ప్రజలు మూడు రోజులు నిద్రపోలేదని అన్నారు. చంద్రబాబు, లగడపాటి, కొన్ని మీడియా సంస్థలు పైశాచిక ఆనందాన్ని పొందాయని విమర్శించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో, మంచి పని తీరుతో ప్రజల మెప్పును పొందామని చెప్పారు. ఓటమి బాధ్యత నుంచి తప్పుకునే ప్రయత్నాన్ని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చేస్తున్నారని అన్నారు. కూటమి ఓటమికి చంద్రబాబే కారణమంటూ కాంగ్రెస్ నేతలు కుంటి సాకులు చెబుతున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబుతో పొత్తును కేసీఆర్ అంగీకరించలేదని... అందుకే ఆయన కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపారని చెప్పారు.

mp vinod
Uttam Kumar Reddy
lagadapati
congress
TRS
  • Loading...

More Telugu News