rajani: రజనీకాంత్ సరసన కథానాయికగా కీర్తి సురేశ్?

  • విడుదలకి ముస్తాబవుతోన్న 'పెట్టా'
  • తదుపరి మూవీ మురుగదాస్ తో 
  • కోలీవుడ్లో ఇప్పుడిదే హాట్ టాపిక్  

రజనీకాంత్ కథానాయకుడిగా ప్రేక్షకులను పలకరించడానికి 'పెట్టా' రెడీ అవుతోంది. ఈ సినిమా విడుదల తేదీని త్వరలోనే నిర్ణయించనున్నారు. ఈ సినిమా తరువాత దర్శకుడు మురుగదాస్ తో కలిసి రజనీ సెట్స్ పైకి వెళ్లనున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులతో మురుగదాస్ బిజీగా వున్నాడు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందనుంది.

ఈ సినిమాలో రజనీ సరసన నాయికగా ఏ సీనియర్ హీరోయిన్ కనిపించనుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆయన జోడీ కట్టేది కీర్తి సురేశ్ అనే వార్త బయటికి రావడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. రజనీకాంత్ యంగ్ హీరోయిన్స్ తో జోడీకట్టక చాలా కాలమైంది. తన వయసుకి తగిన పాత్రలనే ఇటీవల ఆయన చేస్తూ వస్తున్నారు. అలాంటి ఆయన తాజా చిత్రంలో కథానాయికగా కీర్తి సురేశ్ పేరు తెరపైకి రావడం కోలీవుడ్లో హాట్ టాపిక్ గా మారింది. త్రిష లాంటి హీరోయిన్స్ చాలాకాలం పాటు వెయిట్ చేస్తే దక్కిన అవకాశం .. కీర్తి సురేశ్ కి ఇంత త్వరగా దక్కడం అదృష్టమని చెప్పుకుంటున్నారు. 

rajani
keerti suresh
  • Loading...

More Telugu News