Kapil dev: అదే జరిగితే నేను కూడా షర్ట్ తీసేసి పరిగెడతా: కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు

  • ఆక్స్‌ఫర్డ్ వీధిలో షర్ట్ విప్పేస్తానన్న కోహ్లీ
  • భారత్ గెలిస్తే తాను చేసేదీ అదేనన్న కపిల్
  • ఇండియాదే కప్ అన్న గవాస్కర్


వచ్చే ఏడాది ఇంగ్లండ్‌లో జరగనున్న ప్రపంచకప్‌లో భారత్ కనుక విజయం సాధిస్తే తాను కూడా చొక్కా విప్పేసి పరుగులు పెడతానని టీమిండియా మాజీ దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ అన్నాడు. ఢిల్లీలో ప్రైవేటు చానల్‌తో మాట్లాడుతూ కపిల్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచకప్ గెలిస్తే తాను ఆక్స్‌ఫర్డ్ వీధుల్లో చొక్కా తీసేసి పరుగులు పెడతానని కోహ్లీ అన్నాడని, అదే జరిగితే తాను కూడా షర్ట్ విప్పేసి పరిగెడతానని స్పష్టం చేశాడు. ఈ దేశం కోసం తానేమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నాడు.  

ప్రపంచకప్‌ను ఎవరు గెలవబోతున్నారన్న ప్రశ్నకు కపిల్ బదులిస్తూ తన హృదయం, తన మెదడు భారత్ గెలుస్తుందని చెబుతోందన్నాడు. ‘‘ఇండియా గెలుస్తుందని నా హృదయం చెబుతోంది. ప్రపంచకప్‌ను సొంతం చేసుకునేలా మంచి క్రికెట్ ఆడాలని నా మెదడు కోరుకుంటోంది’’ అని కపిల్ పేర్కొన్నాడు. మరో దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ కూడా ఇదే ప్రశ్నకు ఇలాగే సమాధానం చెప్పాడు. తన హృదయం భారత్ కోసమే కొట్టుకుంటోందన్నాడు. ‘‘ప్రపంచకప్ భారత్‌కు వస్తోంది’’అని లిటిల్ మాస్టర్ వ్యాఖ్యానించాడు. ప్రపంచకప్‌లో ధోనీ మరోసారి తన దైన శైలిలో రెచ్చిపోతాడని పేర్కొన్నాడు.

Kapil dev
Sunil gavaskar
Virat Kohli
World Cup
MS Dhoni
England
  • Loading...

More Telugu News