Esha ambani: ఇషా వివాహం... 30 వేల గిగాబైట్ల మెమొరీలో ఫోటోలు

  • గత వారంలో ముగిసిన ఈశా వివాహం
  • దాదాపు లక్షకు పైగా ఫోటోలు తీసిన వివేక్
  • ముఖేష్ కుటుంబానికి రుణపడివుంటానని వెల్లడి

ఇండియాలోని అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ గారాలపట్టి ఇషా అంబానీ వివాహం గత వారంలో అత్యంత వైభవంగా ముగిసిన సంగతి తెలిసిందే. ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలను 30 వేల గిగాబైట్ల (30 టెరాబైట్లు) మెమొరీలో భద్రపరిచాడు ఫోటోగ్రాఫర్ వివేక్. దాదాపు లక్షకు పైగా ఫోటోలను తాము తీశామని ఆయన తెలిపారు.

2010, 2011, 2012, 2014 సంవత్సరాల్లో బెస్ట్ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ గా అవార్డులు అందుకున్న వివేక్ కు, ఈ పెళ్లి గురించిన కాంట్రాక్టు జూన్ లోనే వచ్చిందట. డిసెంబర్ 1 నుంచి 15 వరకూ ఎటువంటి కార్యక్రమాలూ పెట్టుకోవద్దని తనను ఓ వ్యక్తి సంప్రదించాడని, క్లయింట్ ఎవరని అడిగితే, చెప్పలేదని తెలిపారు. తాను షూట్ చేయబోయే వివాహం ఈషా అంబానీదని అక్టోబర్ లో తెలిసిందని చెప్పారు. అది నిజమని నమ్మడానికి తనకు రెండు రోజులు పట్టిందని వివేక్ చెప్పుకొచ్చారు. ఎంతో మంది గొప్ప గొప్ప ఫోటోగ్రాఫర్లు ఉన్నప్పటికీ, తనకు అవకాశం ఇచ్చారని, అందుకు ముఖేష్ కుటుంబానికి రుణపడివుంటానని అన్నారు.

Esha ambani
Mukesh Ambani
Vivek
Photographer
  • Loading...

More Telugu News