woman: ఎలక్ట్రిక్ టెస్లా కారులో పెట్రోలు నింపేందుకు మహిళ ప్రయత్నం.. వీడియో వైరల్

  • దాదాపు మూడు నిమిషాలపాటు ప్రయత్నించిన మహిళ
  • విచిత్రంగా చూసిన జనం 
  • ఓ వ్యక్తి గమనించి చెప్పడంతో నవ్వేసిన వైనం

బ్యాటరీతో నడిచే ఎలక్ట్రానిక్ కారులో పెట్రోలు నింపేందుకు ఓ మహిళ విశ్వప్రయత్నం చేసింది. పెట్రోలు బంకులో ఉన్న ఓ వ్యక్తి ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో విపరీతంగా వైరల్ అవుతోంది. అమెరికాలో జరిగిందీ ఘటన. టెస్లా కారును డ్రైవ్ చేసుకుంటూ పెట్రోలు బంకులోకి వచ్చిన మహిళ దానికి పెట్రోలు పోయించేందుకు చాలా సేపు ప్రయత్నించింది.

పెట్రోలు ట్యాంకు కోసం కారు మొత్తం వెతికింది. మూడు నిమిషాలపాటు ప్రయత్నించింది. ఆమె ప్రయత్నాన్ని అక్కడే ఉన్న వారు చూస్తూ నవ్వుకున్నారు. చివరికి ఓ వ్యక్తి ముందుకొచ్చి అది ఎలక్ట్రిక్ కారు అని, దానికి పెట్రోలు పోయరని చెప్పడంతో అప్పుడు కానీ ఆమె తన తప్పును తెలుసుకోలేకపోయింది. విషయం తెలిసిన మహిళ పెద్దగా నవ్వేసి, కారు తనది కాదని, అందుకే ఆ విషయాన్ని తెలుసుకోలేకపోయానని చెప్పేసి, అక్కడి నుంచి తుర్రుమంది. 

woman
Tesla car
fuel station
electric
America
  • Loading...

More Telugu News