Saipallavi: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • షూటింగులో ఏడ్చేసిన సాయిపల్లవి!
  • ప్రముఖ నిర్మాత చేతిలో రజనీకాంత్ సినిమా 
  • 'పడి పడి లేచె మనసు' నిడివి ఎక్కువేనట!  

*  నేటి తరం టాలెంటెడ్ కథానాయికలలో సాయిపల్లవి కూడా వుంటుంది. ఆమె నటనా ప్రతిభకు నిదర్శనంగా త్వరలో విడుదల కానున్న 'మారి 2' సినిమా గురించి ఆ చిత్ర దర్శకుడు బాలాజీ మోహన్ చెప్పారు. ఈ సినిమా షూటింగులో ఓ సన్నివేశంలో సాయిపల్లవి నిజంగానే ఏడ్చేసిందట. పాత్రలో అంతగా లీనమై ఆమె నటిస్తుందని దర్శకుడు చెప్పారు.
*  తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం 'పెట్టా' తెలుగు వెర్షన్ హక్కులను ప్రముఖ నిర్మాత సి.కల్యాణ్ సొంతం చేసుకున్నారు. కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సిమ్రన్, త్రిష హీరోయిన్లుగా నటించారు.  
*  శర్వానంద్, సాయిపల్లవి జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన 'పడిపడి లేచె మనసు' చిత్రం ఈ శుక్రవారం విడుదలవుతోంది. కాగా, ఈ చిత్రం రన్ టైం (నిడివి) 2  గంటల 39 నిమిషాలు వుందట. ప్రేమకథా చిత్రానికి ఇంత నిడివి కాస్త ఎక్కువనే చెప్పాలి. 

  • Loading...

More Telugu News