cbi: సీబీఐ అదనపు డైరెక్టర్ గా నాగేశ్వరరావుకు పదోన్నతి

  • ఈ మేరకు కేంద్ర కేబినెట్ నియామకాల కమిటీ నిర్ణయం
  • ఇటీవలే తాత్కాలిక డైరెక్టర్ అయిన నాగేశ్వరరావు  
  • తక్కువ సమయంలోనే తన ‘మార్క్’ చూపిన వైనం

సీబీఐ తాత్కాలికగా డైరెక్టర్ గా ఇటీవల నియమితులైన మన్నెం నాగేశ్వరరావుకు పదోన్నతి లభించింది. సీబీఐ అదనపు డైరెక్టర్ గా నాగేశ్వరరావుకు పదోన్నతి కల్పిస్తున్నట్టు కేంద్ర కేబినెట్ నియామకాల కమిటీ నిర్ణయం తీసుకుంది. కాగా, సీబీఐలో చోటుచేసుకున్న అనూహ్య పరిణామాల నేపథ్యంలో తెలుగు వ్యక్తి నాగేశ్వరరావును ఇటీవలే తాత్కాలిక డైరెక్టర్ గా నియమించారు.

కాగా, సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే నాగేశ్వరరావు తన ముద్ర వేశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సీబీఐ అధికారులు అలోక్ వర్మ, ఆస్థానాలకు చెందిన టీమ్ సభ్యులను పలు ప్రాంతాలకు బదిలీ చేశారు. మొత్తం 13 మంది కీలక అధికారులను ఆయన బదిలీ చేయడం గమనార్హం.

cbi
mannem nageswara rao
additional director
alok varma
aasthana
  • Loading...

More Telugu News