Andhra Pradesh: ఏపీ మంత్రి శిద్ధా సోదరుడి మృతి.. ఫోన్ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు!

  • మంత్రి శిద్ధా సోదరుడు వెంకట్రావు మృతి
  • ఒంగోలులో ముగిసిన అంత్యక్రియలు
  • సంతాపం తెలిపిన టీడీపీ నేతలు

ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ మంత్రి శిద్ధా రాఘవరావు ఇంటిలో విషాదం నెలకొంది. మంత్రి సోదరుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త శిద్ధా వెంకట్రావు(83) కన్నుమూశారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వెంకట్రావు చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గ్రానైట్ రంగంలో వెంకట్రావు పేరుమోసిన పారిశ్రామికవేత్త. ఈ నేపథ్యంలో ఆయన భౌతికకాయాన్ని ఈరోజు ఒంగోలులోని ఆయన ఇంటికి తీసుకొచ్చారు. అనంతరం ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలోని శ్మశానవాటికలో అంత్యక్రియలు పూర్తిచేశారు. శిద్ధా వెంకట్రావు మరణంపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు శాసనమండలి సభ్యుడు కరణం బలరాం, కొండపి ఎమ్మెల్యే డాక్టర్‌ స్వామి, సంతనూతలపాడు మాజీ ఎమ్మెల్యే బిఎన్‌ విజయకుమార్‌ తదితరులు సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా మంత్రికి ఫోన్ చేసిన చంద్రబాబు.. ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Andhra Pradesh
ongole
Prakasam District
sidda raghavarao
Chandrababu
Telugudesam
phone
  • Loading...

More Telugu News