Andhra Pradesh: చంద్రబాబు ఇంటికి వెళ్లిన కేశినేని నాని.. కుమార్తె వివాహానికి రావాలని ఆహ్వానం!

  • రాబోయే ఎన్నికల్లో 130 అసెంబ్లీ, 20 లోక్ సభ సీట్లు సాధిస్తాం
  • చంద్రబాబు పాలనపై ఏపీ ప్రజలు సంతృప్తిగా ఉన్నారు
  • ఉండవల్లిలో మీడియాతో మాట్లాడిన టీడీపీ నేత

ప్రధాని నరేంద్ర మోదీ పతనం మొదలయిందని టీడీపీ నేత, పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని వ్యాఖ్యానించారు. రాజస్తాన్, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ లో వచ్చిన ఫలితాలే దేశమంతా పునరావృతం అవుతాయని జోస్యం చెప్పారు. 2019లో మోదీని దేశ ప్రజలు ఇంటికి సాగనంపుతారని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చినప్పటికీ, రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంపై తమకు అనుమానాలు ఉన్నాయన్నారు. ఉండవల్లిలో ఈరోజు ముఖ్యమంత్రిని ఆయన నివాసంలో నాని కలుసుకున్నారు. ఈ సందర్భంగా తన కుమార్తె పెళ్లికి రావాల్సిందిగా చంద్రబాబుకు వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రాబోయే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ 130 స్థానాల్లో ఘనవిజయం సాధిస్తుందని, అలాగే 20 లోక్ సభ సీట్లను దక్కించుకుంటామని చెప్పారు. ఏపీలో చంద్రబాబు నాయకత్వంపై రాష్ట్ర ప్రజలు సంతృప్తిగా ఉన్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. యూపీఏ హయాంలో జరిగిన రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందానికి, మోదీ హయాంలో జరిగిన ఒప్పందానికి మధ్య చాలా తేడా ఉందని ఆయన విమర్శించారు. 

Andhra Pradesh
Chandrababu
Kesineni Nani
daughter
marriage
invitation
Narendra Modi
Telugudesam
  • Loading...

More Telugu News