Andhra Pradesh: ఆంధ్రాకు ప్రత్యేకహోదాపై పార్లమెంటులో ప్రశ్నించిన టీడీపీ.. ఒక్క ముక్కలో తేల్చిపారేసిన కేంద్రం!

  • ఏపీకి ఇప్పటికే ప్యాకేజీ ప్రకటించాం
  • 14వ ఆర్థిక సంఘం హోదాలు ఇవ్వొద్దని చెప్పింది
  • రాజ్యసభలో ప్రశ్నించిన టీడీపీ ఎంపీ రవీంద్రకుమార్

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా కోసం అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ ఉద్యమిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ డిమాండ్ పై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాకు బదులుగా ప్రత్యేక ప్యాకేజీని ఇప్పటికే ప్రకటించామని కేంద్రం తెలిపింది. 14వ ఆర్థిక సంఘం నివేదిక ఆధారంగా ప్రత్యేక హోదాను దేశంలో అమలు చేయడం లేదని స్పష్టం చేసింది. విదేశీ సంస్థల ద్వారా ఏపీ పునర్నిర్మాణానికి సాయం చేస్తున్నట్లు వెల్లడించింది. టీడీపీ పార్లమెంటు సభ్యుడు రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు జవాబు ఇచ్చింది.

Andhra Pradesh
Special Category Status
parliament
centre
answer
  • Loading...

More Telugu News