Sabarimala: శబరిమలలో అనూహ్య ఘటన... స్వామిని దర్శించుకున్న హిజ్రాలు!
- ఇప్పటివరకూ పురుషులకు మాత్రమే పరిమితం
- తొలిసారిగా హిజ్రాలకు దర్శనమిచ్చిన అయ్యప్ప
- పటిష్ఠ బందోబస్తు నడుమ సన్నిధానానికి హిజ్రాలు
ఇప్పటివరకూ కేవలం పురుషులకు మాత్రమే పరిమితమైన శబరిమల అయ్యప్ప తొలిసారిగా హిజ్రాలకు దర్శనమిచ్చిన అనూహ్య ఘటన నేడు చోటుచేసుకుంది. కొందరు హిజ్రాలు ఇరుముడితో స్వామిని దర్శించుకునేందుకు రాగా, ముందు జాగ్రత్త చర్యగా 16వ తేదీన పోలీసులు వారిని నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఆపై ఆలయ ప్రధాన పూజారి రాజీవర్ తో చర్చించిన పోలీసులు, వారిని ఈ ఉదయం పటిష్ఠ భద్రత మధ్య సన్నిధానం వద్దకు తీసుకెళ్లి స్వామి దర్శనం చేయించారు. పలువురు భక్తులు హిజ్రాలను అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ, వారి ప్రయత్నం ఫలించలేదు. "స్వామి శరణం... అయ్యప్ప శరణం" అని శరణుఘోష చేస్తూ హిజ్రాలు స్వామిని దర్శించుకున్నారు.
#WATCH Kerala: A transgender delegation which was stopped from entering #Sabarimala temple by police on 16 December has been granted permission after discussions with the chief priest. pic.twitter.com/3S9n4453Po
— ANI (@ANI) December 18, 2018