Srikakulam District: సోంపేటకు వచ్చిన సినీ నటి సురభి... ఫ్యాన్స్ తొక్కిసలాట!

  • దుస్తుల దుకాణాన్ని ప్రారంభించిన సురభి
  • తొలిసారి హీరోయిన్ రావడంతో తరలివచ్చిన ఫ్యాన్స్
  • అభిమానులను అదుపు చేసిన పోలీసులు

శ్రీకాకుళం జిల్లా సోంపేట పట్టణానికి సినీ నటి సురభి వచ్చిన వేళ, ఆమెను చూసేందుకు పెద్దఎత్తున అభిమానులు, ప్రజలు ఆసక్తి చూపడంతో తొక్కిసలాట జరిగింది. పట్టణంలోని ఓ దుస్తుల దుకాణాన్ని ప్రారంభించేందుకు ఆమె వచ్చింది. ఓ హీరోయిన్ సోంపేట ప్రాంతానికి రావడం ఇదే తొలిసారి కావడం, ఈ షాప్ ఓపెనింగ్ గురించి సోంపేట, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ముందుగానే ప్రచారం చేయడంతో జనం పెద్ద సంఖ్యలో వచ్చారు.

దీంతో దాదాపు పట్టణమంతా ట్రాఫిక్ జామ్ అయింది. షాపు ఓపెనింగ్ తరువాత, ఆమె బయటకు రాగా, అభిమానులు ఒక్కసారిగా ముందుకు దూసుకు వచ్చారు. ఈ సమయంలో తొక్కిసలాట జరుగగా, మహిళలు, పిల్లలు ఇబ్బంది పడ్డారు. పోలీసులు అభిమానులను అదుపుచేసి, సురభి అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు సహకరించారు.

Srikakulam District
Sompeta
Surabhi
Fans
  • Loading...

More Telugu News