Virat Kohli: నేనేమీ ఇంకా గర్భం దాల్చలేదు: అనుష్క శర్మ

  • గత సంవత్సరంలో విరాట్, అనుష్కల వివాహం
  • అనుష్క గర్భం దాల్చిందని వార్తలు
  • అవన్నీ పుకార్లేనని స్పష్టం చేసిన అనుష్క

గత సంవత్సరం డిసెంబర్ లో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలు వివాహం చేసుకోగా, ప్రస్తుతం తాను గర్భవతినని వార్తలు వస్తున్న వేళ, క్లారిటీ ఇచ్చింది అనుష్క. అటువంటిదేమీ లేదని, తానింకా గర్భం దాల్చలేదని, మీడియాలో వస్తున్న వార్తలు అసత్యమని 'టైమ్స్ ఆఫ్ ఇండియా'కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపింది.

తాను యుక్త వయసులోనే పెళ్లి చేసుకున్నానని, గర్భం వస్తే దాచిపెట్టే అవకాశం ఉండదని చెప్పింది. ఎవరో కొందరు పుకార్లు పుట్టించి, ఆపై అది అబద్ధమని తెలుసుకుని, మరో జంట వెనుక పడుతుంటారని అనుష్క వ్యాఖ్యానించింది. కాగా, అనుష్క, షారూక్ జంటగా నటించిన 'జీరో' త్వరలో విడుదలకు సిద్ధంకాగా, ఆ సినిమా ప్రమోషన్ లో ఇప్పుడామె బిజీగా ఉండగా, విరాట్ ఆస్ట్రేలియాలో సుదీర్ఘ పర్యటన నిమిత్తం వెళ్లాడన్న సంగతి తెలిసిందే.

Virat Kohli
Anushka Sharma
Pregnent
  • Loading...

More Telugu News