Allu Arjun: చిరంజీవి ఏంటి?... చిరంజీవి గారూ అనాలి!: అల్లు అర్జున్

  • హైదరాబాద్ లో 'పడి పడి లేచె మనసు' ప్రీ ఈవెంట్
  • ముఖ్య అతిథిగా హాజరైన అల్లు అర్జున్
  • ఎదుటివారిని గౌరవించాలని సలహా

ఎదుటి వ్యక్తిపై ఇష్టం ఉన్నా, లేకున్నా, నచ్చినా నచ్చకున్నా ముందుగా గౌరవించడం నేర్చుకోవాలని మెగా హీరో అల్లు అర్జున్ వ్యాఖ్యానించాడు. నిన్న రాత్రి హైదరాబాద్‌లో జరిగిన ‘పడి పడి లేచె మనసు’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు ముఖ్య అతిథిగా వచ్చిన బన్నీ, రాజకీయ నాయకులైనంత మాత్రాన గౌరవించకూడదని లేదు కదా? అని అనడం గమనార్హం.

ఇటీవల తాను టీవీ చూస్తుంటే ఏదో ఓ కార్యక్రమంలో 'చిరంజీవిని పిలువు' అని అనడం వినిపించిందని, 'చిరంజీవి ఏంటి? చిరంజీవి గారు అని పిలవాలి. ఎదుటి వ్యక్తులను గౌరవించాలి' అని సలహా ఇచ్చాడు. ఎవరిని ఉద్దేశించి బన్నీ ఈ వ్యాఖ్యలు చేశాడోగానీ, వీటిపై కొత్త చర్చ మొదలైంది.

కాగా, శర్వానంద్, సాయి పల్లవి నటించిన 'పడి పడి లేచె మనసు' ఈనెల 21న విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా ట్రైలర్‌ తనకు బాగా నచ్చిందని, ఓ మంచి ప్రేమకథగా నిలిచిపోతుందని వ్యాఖ్యానించిన అల్లు అర్జున్, 'ప్రేమమ్‌', 'ఫిదా', 'ఎంసిఏ'లో సాయి పల్లవిని చూశానని, తనతో డ్యాన్స్‌ ఎప్పుడు చేయాలా? అని ఎదురుచూస్తున్నానని అన్నాడు. 

Allu Arjun
Chiranjeevi
Padi Padi Leche Manasu
Sarvanand
Sai Pallavi
  • Loading...

More Telugu News