Tej pratap yadav: మళ్లీ వచ్చేస్తున్నా.. తేజ్ ప్రతాప్ యాదవ్ ప్రకటన

  • భార్య ఐశ్వర్యతో విడాకులకు దరఖాస్తు
  • కుటుంబ సభ్యులపై అలిగి బయటకు వెళ్లిపోయిన తేజ్ ప్రతాప్
  • కార్యకర్తలతో రెండు గంటలపాటు సమావేశం

భార్య ఐశ్వర్య రాయ్‌కు విడాకులు ఇస్తున్నట్టు ప్రకటించి, ఆపై కుటుంబ సభ్యులపై అలిగి ఇంటి నుంచి వెళ్లిపోయిన బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలు ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ తిరిగి బీహార్ చేరుకున్నారు. సోమవారం పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఆర్జేడీ యువ విభాగం కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. రెండు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో పలు విషయాలపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.  

ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్ విజయం సాధించడానికి రాహుల్ ఎంతో కృషి చేశారని ప్రశంసించారు. తాను శ్రీకృష్ణుడి ఆసీస్సులు తీసుకుని వచ్చానని, వచ్చే లోక్‌సభ ఎన్నికలు కురుక్షేత్రం యుద్ధాన్ని తలపిస్తాయని అన్నారు. పాప్యులర్ ఓట్ అనే సుదర్శన చక్రంతో ప్రత్యర్థులను మట్టి కరిపిస్తానని పేర్కొన్నారు.

Tej pratap yadav
Bihar
Rahul Gandhi
Congress
RJD
Lalu prasad yadav
  • Loading...

More Telugu News