kcr: కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తే మేలు జరుగుతుందని బాబు అనుకోవడం భ్రమే!: జీవీఎల్
- చంద్రబాబు తన పనులను సమర్థించుకుంటారు
- ఎదుటివాళ్లను మాత్రం నిందిస్తారు
- ‘రాఫెల్’ పై అవాస్తవాలు ప్రచారం చేశారు
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడులపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మరోసారి విమర్శలు చేశారు. తాను చేసే పనులను సమర్థించుకోవడం, ఎదుటివాళ్లను నిందించడం సీఎం చంద్రబాబుకు అలవాటేనని విమర్శించారు. ప్రకృతి విపత్తులను పట్టించుకోకుండా రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో సీఎంల ప్రమాణ స్వీకార కార్యక్రమాలకు ఆయన వెళ్లడం సబబు కాదని హితవు పలికారు.
రాఫెల్ డీల్ పై రాహుల్, చంద్రబాబు అవాస్తవాలు ప్రచారం చేశారని నిప్పులు చెరిగారు. ఈ డీల్ పై అబద్ధాలు ప్రచారం చేసిన రాహుల్ ను పార్లమెంట్ సమావేశాల్లో నిలదీస్తామని అన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానన్న కేసీఆర్ వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు. కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తే మేలు జరుగుతుందని చంద్రబాబు అనుకోవడం ఆయన భ్రమేనంటూ జీవీఎల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.