harsimrat kaur: చివరకు గాంధీ కుటుంబానికి కూడా సెగ తప్పదు: హర్ సిమ్రత్ కౌర్
- సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసు దర్యాప్తుకు సిట్ ఏర్పాటు చేసిన మోదీకి ధన్యవాదాలు
- ఢిల్లీ హైకోర్టు తీర్పుతో న్యాయ చక్రాలు ముందుకు కదిలాయి
- రేపు టైట్లర్, ఆ తర్వాత కమల్ నాథ్ వంతు వస్తుంది
1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో కాంగ్రెస్ నేత సజ్జన్ కుమార్ కు జీవిత ఖైదు విధిస్తూ ఢిల్లీ హైకోర్టు తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా శిరోమణి అకాళీదళ్ నాయకురాలు, కేంద్ర మంత్రి హర్ సిమ్రత్ కౌర్ స్పందించారు. 2015లో తాము చేసిన విన్నపం మేరకు ఈ కేసు దర్యాప్తుకు సిట్ ను ఏర్పాటు చేసిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలుపుతున్నామని చెప్పారు. ఢిల్లీ హైకోర్టు తీర్పుతో న్యాయ చక్రాలు ముందుకు కదిలాయని ఆమె అన్నారు. ఈరోజు సజ్జన్ కుమార్ దోషిగా తేలారని... రేపు జగదీష్ టైట్లర్, ఆ తర్వాత కమల్ నాథ్ వంతు వస్తుందని చెప్పారు. చివరకు గాంధీ కుటుంబానికి కూడా సెగ తప్పదని అన్నారు.