koffee with karan: కరణ్ జొహార్ కార్యక్రమంలో తొలిసారి కనిపించనున్న సౌత్ స్టార్స్.. అనుష్క గురించి ప్రభాస్ కు ప్రశ్న

  • 'కాఫీ విత్ కరణ్' ఫోలో తొలిసారి కనిపించనున్న సౌతిండియన్ స్టార్స్
  • ప్రోమోను విడుదల చేసిన స్టార్ వరల్డ్
  • వచ్చే ఆదివారం ప్రసారం కానున్న ఎపిసోడ్

బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జొహార్ హోస్ట్ చేస్తున్న 'కాఫీ విత్ కరణ్' కార్యక్రమం సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో కనిపించేందుకు బాలీవుడ్ స్టార్స్ ఎదురు చూస్తుంటారనడంలో అతిశయోక్తి లేదు. అంత పాప్యులారిటీ ఉన్న ఈ కార్యక్రమంలో ఇంత వరకు దక్షిణాదికి చెందిన ఒక్క స్టార్ కూడా కనిపించలేదు. తొలిసారిగా ఈ కార్యక్రమంలో దక్షిణాది నుంచి ప్రభాస్, రానా, రాజమౌళిలు కనిపించనున్నారు. దీనికి సంబంధించిన ప్రోమోను స్టార్ వరల్డ్ ఛానల్ విడుదల చేసింది. కరణ్ తో పాటు మన ముగ్గురు స్టార్లు నల్లటి దుస్తులతో ఆకట్టుకుంటున్నారు. వచ్చే ఆదివారం ఈ ఎపిసోడ్ ప్రసారం కాబోతోంది.

కాఫీ విత్ కరణ్ జొహార్ కార్యక్రమం అంటేనే వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అని చెప్పుకోవచ్చు. నటీనటుల వ్యక్తిగత విషయాలను ఏమాత్రం తడబాటు లేకుండా ప్రశ్నిస్తూ, సమాధానాలను రాబట్టే ప్రయత్నాన్ని కరణ్ చేస్తుంటారు. కరణ్ అడిగిన పలు ప్రశ్నలకు బాలీవుడ్ స్టార్లు నీళ్లు నమిలిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ప్రోమోలో 'మీరు సింగిలేనా?' అనే ప్రశ్నను కరణ్ అడగగా... 'నేను సింగిలే' అంటూ ప్రభాస్, రానా ఇద్దరూ నవ్వుతూ సమాధానమిచ్చారు. అనుష్కతో డేటింగ్ గురించి ఈ కార్యక్రమంలో కరణ్ ప్రశ్నించాడు. మీరు అసత్యాలను ప్రచారం చేస్తున్నారంటూ కరణ్ పై జోక్ చేశాడు ప్రభాస్. ఈ అంశంపై కరణ్ ఎలాంటి సమాధానాలు రాబట్టాడో తెలుసుకోవాలంటే వచ్చే ఆదివారం వరకు ఆగాల్సిందే.

koffee with karan
karan johar
prabhas
rana
rajamouli
tollywood
  • Loading...

More Telugu News