YSRCP: జగన్ అధికారంలోకొస్తేనే ‘ఆరోగ్యశ్రీ’ బాగుపడుతుంది: వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి

  • ఈ పథకాన్ని చంద్రబాబు సర్కార్ నిర్వీర్యం చేసింది
  • రూ.500 కోట్ల బకాయిలు ఎందుకు చెల్లించరు?
  • రేపటిలోగా ఈ బకాయిలు చెల్లించాలి 
  • లేకపోతే ఆందోళనకు దిగుతాం

ఏపీలో జగన్ అధికారంలోకొస్తేనే ఆరోగ్యశ్రీ బాగుపడుతుందని వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఆరోగ్యశ్రీ పథకాన్ని చంద్రబాబు సర్కార్ నిర్వీర్యం చేసిందని, కోటి 35 లక్షల కుటుంబాలకు ఉపయోగపడే ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారని, పేద ప్రజలపై బాబు సర్కార్ వివక్ష చూపుతోందని విమర్శించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చలువ వల్లే పేదలకు కార్పొరేట్ వైద్యం అందిందని, ‘ఆరోగ్య శ్రీ’ని నిర్వీర్యం చేసిన చంద్రబాబు ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

బకాయిలు చెల్లించకపోవడంతోనే ఈ పథకం సేవలు నిలిచిపోయాయని, రూ.500 కోట్ల బకాయిలు చెల్లించడానికి ఎందుకు నిర్లక్ష్యం? చినబాబుకు కమీషన్లు రావడం లేదనా? అని ప్రశ్నించిన ఆయన, రేపటిలోగా ఈ బకాయిలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పేదల తరపున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ధర్మపోరాట దీక్షకు వందల కోట్లు ఖర్చు పెడుతున్నారని, చంద్రబాబు పర్యటనలకు వేల కోట్లు ఖర్చు పెడుతున్నారని, కానీ, పేదల వైద్యానికి మాత్రం వెనుకడుగు వేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

YSRCP
mla
srikanth reddy
aarogyasri
Chandrababu
  • Loading...

More Telugu News