balka suman: ఎంపీ పదవికి రాజీనామా చేసిన బాల్క సుమన్

  • సుమిత్రా మహాజన్ కు రాజీనామా లేఖను అందించిన సుమన్
  • చెన్నూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన సుమన్
  • మంత్రి పదవి దక్కే అవకాశం

పెద్దపల్లి టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కు అందజేశారు. ఈ సందర్భంగా సుమన్ తో పాలు పలువురు టీఆర్ఎస్ ఎంపీలు కూడా ఉన్నారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు నుంచి బాల్క సుమన్ గెలుపొందారు. ఈ నేపథ్యంలో, ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. మరోవైపు తెలంగాణ మంత్రివర్గంలో ఆయనకు బెర్త్ లభిస్తుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సుమన్ అత్యంత సన్నిహితుడన్న విషయం తెలిసిందే.

balka suman
TRS
mp
resign
sumitra mahajan
  • Loading...

More Telugu News