MP jitender reddy: విభజన హామీల అమలుపై శీతాకాల సమావేశాల్లో పట్టు: ఎంపీ జితేందర్‌రెడ్డి

  • కేసీఆర్‌ హయాంలో రాష్ట్రంలో 29.9 శాతం అభివృద్ధి
  • ప్రభుత్వ సంక్షేమ పథకాలే మళ్లీ విజయాన్ని అందించాయి
  • మోదీ ప్రభుత్వం చేసింది తక్కువ, చెప్పేది ఎక్కువని విమర్శ

విభజన చట్టంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకై కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రస్తుతం జరుగుతున్న శీతాకాల సమావేశాల్లో పట్టుబట్టనున్నట్లు టీఆర్‌ఎస్‌ ఎంపీ జితేందర్‌రెడ్డి తెలిపారు. చేతలు మానేసి మాటలతో కాలక్షేపం చేస్తున్న మోదీ ప్రభుత్వాన్ని సభలో నిలదీస్తామని చెప్పారు.

కేంద్ర మంత్రులను కలిసి హామీలు అమలు చేయాలని కోరనున్నట్లు తెలిపారు. మోదీ పాలనలో దేశంలో విపత్తు కొనసాగుతోందని ధ్వజమెత్తారు. కేసీఆర్‌ హయాంలో తెలంగాణ రాష్ట్రంలో 29.9 శాతం వృద్ధి నమోదైందని గుర్తు చేశారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలే తిరిగి అధికారంలోకి తెచ్చాయని తెలిపారు.

  • Loading...

More Telugu News