India: విశ్వరూపం చూపించిన షమీ - ఊరిస్తున్న విజయం... 243 పరుగులకు ఆస్ట్రేలియా ఆలౌట్!

  • ఆరు వికెట్లు తీసిన మహమ్మద్ షమీ
  • భారత్ ముందు 287 పరుగుల లక్ష్యం
  • మరోసారి డక్కౌట్ అయిన మురళీ విజయ్

పెర్త్ లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో రెండో ఇన్నింగ్స్ లో ఆసీస్ 243 పరుగులకు ఆలౌట్ కాగా, భారత్ ముందు 287 పరుగుల లక్ష్యం ఉంది. ఈ రోజు ఆటలో భారత పేస్ బౌలర్ షమీ విశ్వరూపాన్ని చూపాడు. ఆసీస్ రెండో ఇన్నింగ్స్ లో 6 వికెట్లు తీశాడు. బుమ్రాకు 3 వికెట్లు, ఇషాంత్ కు ఒక వికెట్ దక్కాయి.

ఈ మ్యాచ్ లో భారత్ ను విజయం ఊరిస్తోంది. మ్యాచ్ దాదాపు ఇంకా ఒకటిన్నర రోజు మిగిలివుంది. భారత ఆటగాళ్లలో ఏ ఇద్దరు, ముగ్గురైనా రాణిస్తే విజయం సాధించే అవకాశాలు పుష్కలం. తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ చేసిన కోహ్లీ, రెండో ఇన్నింగ్స్ లో ఎలా ఆడుతాడన్నదే కీలకం.

కాగా, 287 పరుగుల అసాధ్యం కాని విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత బ్యాట్స్ మెన్లలో ఓపెనర్ కేఎల్ రాహుల్ మరోసారి నిరాశ పరిచాడు. స్టార్క్ బౌలింగ్ లో తొలి ఓవర్ నాలుగో బంతికే డక్కౌట్ గా పెవీలియన్ చేరాడు. దీంతో భారత్ తన తొలి వికెట్ ను కోల్పోయింది.

India
Australia
Cricket
Murali vijay
  • Loading...

More Telugu News