Akshay Khanna: బాలీవుడ్ హీరో అక్షయ్ ఖన్నాకు మాతృవియోగం!

  • అనారోగ్యంతో బాధపడుతూ మృతి
  • సంతాపం తెలిపిన పలువురు ప్రముఖులు
  • అంత్యక్రియలు పూర్తి

బాలీవుడ్ హీరో నటుడు అక్షయ్‌, రాహుల్‌ ఖన్నాల తల్లి గీతాంజలి కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతుండగా, ఒక్కసారిగా ఆరోగ్యం క్షీణించి మరణించినట్టు తెలుస్తోంది. గీతాంజలి, వినోద్‌ ఖన్నా మాజీ భార్య. ప్రస్తుతం తన కుమారుడు అక్షయ్ తో పాటు మంద్వాలోని ఫామ్‌ హౌస్‌ లో ఉంటున్న ఆమెను అలిబగ్‌ సివిల్‌ ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయిందని కుటుంబసభ్యులు తెలిపారు.

శనివారం రాత్రి నిద్రిస్తున్న తన తల్లిని చూసేందుకు అక్షయ్ వెళ్లగా, అప్పటికే ఆమె శరీర ఉష్ణోగ్రత బాగా పడిపోయింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా, అప్పటికే ఆమె మరణించినట్టు వైద్యలు తెలిపారు. గీతాంజలి మృతిపై పలువురు బాలీవుడ్ ప్రముఖులు అక్షయ్ ఖన్నాను పరామర్శించారు. ఆమె అంత్యక్రియలు పూర్తయ్యాయి.

Akshay Khanna
Rahul Khanna
Geetanjali
  • Loading...

More Telugu News