Chandrababu: సిగ్గుచేటు... పెథాయ్ బీభత్సం సృష్టిస్తుంటే జైపూర్ ఎందుకు?: చంద్రబాబును ప్రశ్నించిన జీవీఎల్

  • రాజస్థాన్ కు బయలుదేరి వెళ్లిన చంద్రబాబు
  • రోమ్ చక్రవర్తిని తలపిస్తున్న చంద్రబాబు చర్య
  • ట్విట్టర్ లో మండిపడ్డ జీవీఎల్

ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నేడు రాజస్థాన్ లో జరిగే అశోక్ గెహ్లాట్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యేందుకు జైపూర్ బయలుదేరగా, బీజేపీ నేత జీవీఎల్ నరసింహరావు మండిపడ్డారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ ను పెడుతూ, భయంకరమైన పెథాయ్ తుపాన్ ఏపీలో భారీ వర్షాలను కురిపిస్తుంటే, ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం జైపూర్ లో ల్యాండ్ అయ్యారని ఆరోపించారు.

 రాష్ట్రంలో మూడింట రెండు వంతుల మంది ఇబ్బందులు పడుతున్న వేళ, రోమ్ చక్రవర్తిని తలపించేలా చంద్రబాబు ప్రవర్తించారని మండిపడ్డారు. రోమ్ తగులబడుతుంటే, చక్రవర్తి ఫిడేల్ వాయించినట్టుగా చంద్రబాబు తీరు కనిపిస్తోందని, సిగ్గుచేటని వ్యాఖ్యానించారు.



Chandrababu
GVL
Pethai
Twitter
  • Loading...

More Telugu News