ramdas atavale: రాహుల్‌ తెలివైనవారనిపించుకున్నారు: కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే ఆసక్తికర వ్యాఖ్యలు

  • ఆయన ఇప్పుడు పప్పూ కాదు...పప్పా
  • మూడు రాష్ట్రాల్లో ఓడింది బీజేపీనే...మోదీ కాదు
  • సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిచే అవకాశం లేదు

ఉత్తరాదిలోని మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు, కేంద్ర సామాజిక న్యాయశాఖ సహాయ మంత్రి రాందాస్ అథవాలే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మూడు రాష్ట్రాల్లో పార్టీకి విజయం సాధించి పెట్టడం ద్వారా రాహుల్‌గాంధీ తాను ఎంతమాత్రం తెలివి తక్కువవాడు (పప్పు) కాదు, పార్టీకి తండ్రి (పప్పా) లాంటివాడని నిరూపించుకున్నారన్నారు.

 రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ మూడు రాష్ట్రాల్లో ఓడిపోయింది బీజేపీ మాత్రమేనని, ప్రధాని నరేంద్ర మోదీ కాదని అన్నారు. రాఫెల్‌ ఆరోపణలతో రాష్ట్రాల ఎన్నికల్లో గట్టెక్కినా, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలిచే అవకాశం లేదని స్పష్టం చేశారు. శివసేన ఒంటరిగా పోటీ చేయడం మంచిది కాదని, బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీకే లాభమని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

ramdas atavale
BJP
Rahul Gandhi
  • Error fetching data: Network response was not ok

More Telugu News