Chandrababu: 'ఆయన గల్లీ లీడర్' అన్న ఈయనే సిల్లీ లీడర్!: కేటీఆర్ కు బుద్ధా వెంకన్న కౌంటర్

  • చంద్రబాబు ఓ గల్లీ లీడర్ అన్న కేటీఆర్
  • కేటీఆర్ ను సిల్లీ లీడర్ గా అభివర్ణించిన బుద్ధా వెంకన్న
  • దమ్ముంటే కేసీఆర్, ఒవైసీ పోటీ చేయాలని సవాల్

సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిని 'గల్లీ లీడర్‌' అని సంబోధించిన తెలంగాణ నేత కేటీఆర్‌ ఓ 'సిల్లీ లీడర్‌' అని టీడీపీ అధికార ప్రతినిధి, ప్రభుత్వ విప్‌ బుద్ధా వెంకన్న వ్యాఖ్యానించారు. మంత్రి ఎన్ఎండీ ఫరూక్ తో కలసి మీడియాతో మాట్లాడిన ఆయన, అడ్రస్‌ లేనివారు చంద్రబాబుపై అవాకులు, చవాకులు పేలుతున్నారని మండిపడ్డారు.

 ఏపీ రాజకీయాల్లోకి కేసీఆర్, కేటీఆర్, ఒవైసీలు దమ్ముంటే రావాలని సవాల్ విసిరిన ఆయన, గతంలో ముస్లింలు అధికంగా ఉన్న నంద్యాలలో ఒవైసీ పోటీ చేస్తే, కేవలం ఒక్క శాతం ఓట్లు మాత్రమే వచ్చాయని గుర్తు చేశారు. నంద్యాలలో మరోసారి ఒవైసీ పోటీ చేయవచ్చని, కర్నూలు నుంచి కేసీఆర్ బరిలోకి దిగవచ్చని, ప్రజల తీర్పే అంతిమమని మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ వ్యాఖ్యానించారు. ఒవైసీ, కేసీఆర్‌ పోటీచేస్తే ప్రజలు ఎవరికి పట్టంకడతారో తేలిపోతుందన్నారు.

Chandrababu
Buddha Venkanna
KCR
KTR
Asaduddin Owaisi
  • Loading...

More Telugu News