SCR: పెథాయ్ ఎఫెక్ట్... నేడు పలు రైళ్ల రద్దు... వివరాలివి!

  • ఉభయ గోదావరి జిల్లాలపై తుపాను ప్రభావం
  • కృష్ణా, గుంటూరు జిల్లాలపై కూడా
  • ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే

పెథాయ్ తుపాను ప్రభావం గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలపై అధికంగా ఉన్న నేపథ్యంలో నేడు పలు ప్యాసింజర్ రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్ కుమార్ వెల్లడించారు.

నేడు రద్దయిన రైళ్లలో నెం. 67300 (విజయవాడ-రాజమండ్రి, మెము ప్యాసింజర్‌), నెం 67295 (రాజమండ్రి-విశాఖపట్నం, మెము ప్యాసింజర్‌), నెం. 67244 (విశాఖపట్నం-కాకినాడ పోర్టు, మెము ప్యాసింజర్‌), నెం. 67242 (కాకినాడ పోర్టు-విజయవాడ, మెము ప్యాసింజర్‌), నెం. 67221 (విజయవాడ-తెనాలి, మెము ప్యాసింజర్‌), నెం. 67222 (తెనాలి-గుంటూరు, మెము ప్యాసింజర్‌), నెం. 67225 (గుంటూరు-తెనాలి, మెము ప్యాసింజర్‌), నెం. 67226 (తెనాలి-విజయవాడ, మెము ప్యాసింజర్‌), నెం. 67227 (విజయవాడ-తెనాలి, మెము ప్యాసింజర్‌), నెం. 67228 (తెనాలి-గుంటూరు, మెము ప్యాసింజర్‌), నెం. 67296 (విశాఖపట్నం-రాజమండ్రి, మెము ప్యాసింజర్‌), నెం. 67241 (విజయవాడ-కాకినాడ పోర్ట్‌, మెము ప్యాసింజర్‌), నెం. 77242 (రాజమండ్రి-భీమవరం, డెము ప్యాసింజర్‌) రైళ్లున్నాయి.

వీటితో పాటు ట్రైన్‌ నెం. 77237 (భీమవరం-రాజమండ్రి, డెము ప్యాసింజర్‌), నెం. 77238 (రాజమండ్రి-భీమవరం, డెము ప్యాసింజర్‌), నెం. 77231 (భీమవరం-నిడదవోలు, డెము ప్యాసింజర్‌), నెం. 77240 (నిడదవోలు-భీమవరం, డెము ప్యాసింజర్‌), నెం. 77206 (భీమవరం-విజయవాడ, డెము ప్యాసింజర్‌), నెం. 77294 (రాజమండ్రి-నర్సాపూర్‌, డెము ప్యాసింజర్‌), నెం. 77295 (నర్సాపూర్‌-గుంటూరు, డెము ప్యాసింజర్‌), నెం. 77230 (గుంటూరు-విజయవాడ, డెము ప్యాసింజర్‌), నెం. 77269 (విజయవాడ-మచిలీపట్నం, డెము ప్యాసింజర్‌) ఉన్నాయి.

  • Error fetching data: Network response was not ok

More Telugu News