kTR: కేటీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ మరింత బలోపేతమవుతుంది: తలసాని శ్రీనివాస్‌యాదవ్‌

  • కేటీఆర్ నియామకం ఉత్సాహాన్ని నింపింది
  • అసౌకర్యం కలగకుండా చూడాలని సూచన
  • రేపు పదవీ బాధ్యతలు స్వీకరించనున్న కేటీఆర్

రేపు తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్‌ పదవీ బాధ్యతలు స్వీకరించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడి ఏర్పాట్లను మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, నగర్ మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు పరిశీలించారు. టీఆర్ఎస్ భవన్‌కు చేరుకునే మార్గంలో భద్రతా ఏర్పాట్లపై పోలీసు, ట్రాఫిక్‌ ఉన్నతాధికారులతో నేతలు సమీక్షించారు.

కార్యక్రమానికి పెద్ద ఎత్తున వస్తున్న కార్యకర్తలకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా తలసాని మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ మరింత బలోపేతమవుతుందని పేర్కొన్నారు. కార్యకర్తల్లో కూడా కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులవడం ఉత్సాహాన్ని నింపిందన్నారు.  

kTR
Bonthu Rammohan
Talasani Srinivas Yadav
TRS Bhavan
  • Loading...

More Telugu News