KTR: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా రేపు బాధ్యతలను స్వీకరించనున్న కేటీఆర్
- టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా రేపు బాధ్యతలను స్వీకరించనున్న కేటీఆర్
- ఉదయం 10.15 గంటలకు బసవతారకం ఆసుపత్రి నుంచి పార్టీ కార్యాలయం వరకు ర్యాలీ
- పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగం
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ను ఆ పార్టీ అధినేత కేసీఆర్ నియమించిన సంగతి తెలిసిందే. కార్య నిర్వాహక అధ్యక్షుడి బాధ్యతలను రేపు కేటీఆర్ స్వీకరించనున్నారు. రేపు ఉదయం 10.15 గంటలకు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నుంచి తెలంగాణ భవన్ వరకు ర్యాలీ నిర్వహిస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస యాదవ్ తెలిపారు. అనంతరం తెలంగాణ భవన్ లో తెలంగాణ తల్లి, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలకు కేటీఆర్ పూలమాల వేసి, పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమానికి అన్ని జిల్లాల నుంచి ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తరలివస్తున్నట్టు తెలిపారు.