Telangana: నల్లగొండ లోక్ సభ సీటుకు పోటీ చేస్తా.. రాహుల్ గాంధీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు!: కోమటిరెడ్డి

  • కాంగ్రెస్ కార్యకర్తలు అధైర్యపడొద్దు
  • పంచాయితీ ఎన్నికల్లో సత్తా చాటుదాం
  • టీఆర్ఎస్ పంచాయితీలకు నిధులివ్వలేదు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా కార్యకర్తలు అధైర్య పడొద్దనీ, ఏ సమస్య వచ్చినా తాను ఆదుకుంటానని కాంగ్రెస్ నేత కోమటి రెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. గత 20 ఏళ్లుగా తాను ప్రజాసేవ చేస్తున్నానని, తన జీవితం ప్రజలకే అంకితమని వ్యాఖ్యానించారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో తాను పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. నల్లగొండ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తానని పార్టీ చీఫ్ రాహుల్ గాంధీకి చెప్పాననీ, అందుకు రాహుల్ సైతం అంగీకరించారని కోమటిరెడ్డి అన్నారు.

త్వరలోనే రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికలు జరగనున్నాయనీ, ఈ సర్పంచ్ ఎన్నికలను కాంగ్రెస్ శ్రేణులు సవాలుగా తీసుకుని పనిచేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం పంచాయితీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసిందని విమర్శించారు. గత ఐదేళ్లలో పంచాయితీలకు తగినన్ని నిధులు ఇవ్వలేదనీ, కేంద్రం పంపిన నిధులను సైతం దారి మళ్లించారని ఆరోపించారు. నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసిన కోమటిరెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.

  • Loading...

More Telugu News