kuna ravi kumar: మా అక్క భర్తవి కాబట్టే నీ బండారం బయటపెట్టడం లేదు: తమ్మినేనిపై కూన రవికుమార్ ఫైర్

  • నేను లేకపోతే నీవు ఎక్కడ ఉండేవాడివో గుర్తుంచుకో
  • చంద్రబాబును విమర్శించే హక్కు నీకు లేదు
  • జగన్ ఒక ఫ్యాక్షనిస్టు, మాఫియా నేత, కబ్జాకోరు

వైసీపీ నేత తమ్మినేని సీతారాంపై టీడీపీ నేత, ప్రభుత్వ విప్ కూన రవికుమార్ మండిపడ్డారు. తమ్మినేని తన స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మా అక్క భర్తవి కాబట్టే మీ బండారం బయటపెట్టడం లేదని అన్నారు. 'నేను లేకపోతే నువ్వు ఎక్కడ ఉండేవాడివో గుర్తుంచుకో' అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీడీపీలో పుట్టి రాజకీయంగా ఎదిగిన తమ్మినేనికి ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శించే నైతిక హక్కు లేదని అన్నారు. ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని సూచించారు. శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడూతూ రవికుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రతిపక్ష నాయకుడిగా శ్రీకాకుళం జిల్లాలో తిరిగే నైతికత వైసీపీ అధినేత జగన్ కు లేదని రవికుమార్ అన్నారు. ఫ్యాక్షనిస్టు, మాఫియా నేత, కబ్జాకోరు అయిన జగన్ తనను తాను నీతిమంతుడిగా చిత్రీకరించుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. శ్రీకాకుళం జిల్లాలో జగన్ ను వేలెత్తి చూపించి, విమర్శించగల దమ్మున్న నాయకుడిని తాను ఒక్కడినేనని చెప్పారు.

kuna ravi kumar
tammineni
jagan
Chandrababu
Telugudesam
YSRCP
  • Loading...

More Telugu News