Andhra Pradesh: జగన్ బీజేపీతో అంటకాగుతున్నాడు.. అతనికి ఒవైసీ మద్దతు ఎలా ఇస్తారు?: యనమల

  • మోదీ టీడీపీ నేతలను వేధిస్తున్నారు
  • ఈడీ, ఐటీ, సీబీఐలను ఉసిగొల్పుతున్నారు.
  • ఒవైసీపై ధ్వజమెత్తిన ఏపీ మంత్రి

కేంద్రంలో నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రల్లో వైసీపీ అధినేత జగన్, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పాత్రధారులని ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. ప్రత్యేకహోదా, ప్యాకేజీ, విభజన హామీలను అమలు చేయకపోవడంతోనే ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చామని ఆయన తెలిపారు. కానీ కేంద్రం మాత్రం ఐటీ శాఖ, ఈడీ, సీబీఐ వంటి సంస్థలతో టీడీపీ నేతలపై దాడులు చేయిస్తోందని మండిపడ్డారు. అమరావతిలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో యనమల మాట్లాడారు.

2019లో ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ కు మద్దతు ఇస్తామని మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించడాన్ని యనమల తీవ్రంగా తప్పుపట్టారు. జగన్ తన స్నేహితుడనీ, తాను జగన్ తరఫున ఏపీలో ప్రచారం చేస్తానని అసదుద్దీన్ చెప్పడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. వైసీపీ అధినేత జగన్ బీజేపీతో అంటకాగుతున్నారనీ, అలాంటి వ్యక్తికి బీజేపీ ఎలా మద్దతు ఇస్తుందని ప్రశ్నించారు. బీజేపీ కోసం అసద్ తాను నమ్మిన సిద్ధాంతాలను వదిలేశారా? అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీతోనే అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News