jayasudha: ఆ ఒక్క డైలాగ్ నుంచి 100 కొత్త కథలు రాయవచ్చు: జయసుధ

  • 'బొమ్మరిల్లు' సినిమా నాకు ఎంతో ఇష్టం
  • 'నా చేయి ఇంకా మీ చేతుల్లోనే ఉంది నాన్నా' అనే డైలాగ్ మనసుని తాకుతుంది
  • రెస్టారెంట్ పెట్టాలనే కోరిక ఉంది

తాను ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ... 'బొమ్మరిల్లు' తనకు చాలా ప్రత్యేకమని సహజనటి జయసుధ అన్నారు. ఆ సినిమాలో ముఖ్యంగా క్లైమాక్స్ కట్టి పడేస్తుందని అన్నారు. టీవీలో ఆ సినిమా ఎప్పుడు వచ్చినా... అలా చూస్తూ ఉండిపోతానని తెలిపారు. 'నా చేయి ఇంకా మీ చేతుల్లోనే ఉంది నాన్నా' అని ప్రకాశ్ రాజ్ తో సిద్ధార్థ్ చెప్పే డైలాగ్ మనసును తాకుతుందని... ఆ ఒక్క డైలాగ్ నుంచి కొత్తగా 100 కథలు రాయవచ్చని చెప్పారు.

తాను అన్ని రకాల వంటలను అద్భుతంగా వండుతానని... రెస్టారెంట్ పెట్టాలనే కోరిక ఉందని జయసుధ తెలిపారు. తనకు జిమ్ అంటే పరమ చిరాకని... యోగా, వాకింగ్, స్విమ్మింగ్ లాంటివేమీ చేయనని చెప్పారు. అయితే ఒకే చోట కూర్చోకుండా ఎప్పుడూ అటూ, ఇటూ తిరుగుతుంటానని... లిఫ్ట్ ఉన్నప్పటికీ మెట్లు ఎక్కుతానని అన్నారు. తన ఫిట్ నెస్ సీక్రెట్ ఇదేనని తెలిపారు.

jayasudha
tollywood
fitness
  • Loading...

More Telugu News