Andhra Pradesh: ప్రజాసంకల్ప యాత్రలో ఆసక్తికర ఘటన.. జగన్ తో పెళ్లి దుస్తుల్లో సెల్ఫీ దిగిన కొత్తజంట!

  • శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో పాదయాత్ర
  • జగన్ ను కలుసుకున్న నవ వధూవరులు
  • స్వయంగా ఫోన్ తో సెల్ఫీ దిగిన జగన్

వైసీపీ అధినేత జగన్ 322వ రోజు ప్రజాసంకల్ప యాత్ర శ్రీకాకుళం జిల్లాలో సాగుతున్న సంగతి తెలిసిందే. నరసన్నపేట నియోజకవర్గంలో ఈ రోజు ప్రారంభమైన పాదయాత్ర కోమర్తి, గుండువిల్లిపేట, కరిమిల్లిపేట క్రాస్‌, సత్యవరం క్రాస్‌ మీదుగా జమ్ము జంక్షన్‌ వరకూ సాగనుంది. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా జగన్ ఈరోజు సాయంత్రం నరసన్నపేటలో ఏర్పాటు చేసే బహిరంగ సభలో పాల్గొంటారు. కాగా, జగన్ పాదయాత్ర సందర్భంగా తాజాగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.

ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా ముందుకు సాగుతున్న జగన్ ను ఓ కొత్త జంట కలిసింది. ఈ సందర్భంగా వధూవరులిద్దరూ జగన్ ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ తర్వాత ఆయనతో కలిసి సెల్ఫీ దిగారు. ఈ సందర్భంగా స్మార్ట్ ఫోన్ అందుకున్న జగన్ స్వయంగా వారితో కలిసి సెల్ఫీ దిగారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Andhra Pradesh
Srikakulam District
prajasanklapa yatra
Jagan
YSRCP
selfie
new couple
wedlock
  • Loading...

More Telugu News