PV Sindhu: శభాష్ సింధు.. నిన్ను చూసి దేశం గర్విస్తోంది: కేసీఆర్

  • బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ టైటిల్ గెలిచిన సింధు
  • ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళగా ఘనత
  • దేశానికి గర్వకారణంగా నిలిచిందన్న కేసీఆర్

బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్ లో ఘన విజయం సాధించి టైటిల్ గెలిచిన షట్లర్ పీవీ సింధుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళ సింధును తెలంగాణ ముఖ్యమంత్రి  కేసీఆర్ ప్రశంసించారు. సింధు చరిత్ర సృష్టించిందని ఆయన అన్నారు. దేశానికి గర్వకారణంగా నిలిచిందని... భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని ఆకాంక్షించారు. గ్వాగ్ జౌలో జరిగిన ఫైనల్స్ లో జపాన్ స్టార్ ఒకుహరను సింధు 21-19, 21-17 తేడాతో ఓడించిన సంగతి తెలిసిందే.


PV Sindhu
KCR
bwf world tour
title
  • Loading...

More Telugu News