MS Dhoni: భర్త చేత షూస్ తొడిగించుకున్న సాక్షీ ధోని... వైరల్ అవుతున్న ఫోటో!

- భార్యతో కలసి షాపింగ్ కు వెళ్లిన ధోనీ
- షూస్ కొనుక్కోగా, కాళ్లకు తొడిగిన ధోనీ
- ప్రశంసల వర్షం కురిపిస్తున్న నెటిజన్లు
తన సహచరులంతా ఆస్ట్రేలియాతో క్రికెట్ మ్యాచ్ లు ఆడుతూ బిజీగా ఉన్న వేళ, ఇండియాలో విశ్రాంతి తీసుకుంటున్న ధోనీ ఇటీవల తన భార్య సాక్షీ సింగ్ తో కలసి షాపింగ్ కు వెళ్లిన వేళ, ఓ ఆసక్తికర ఘటన జరుగగా, దానికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
చెప్పుల దుకాణంలో షూస్ పరీక్షించుకునే క్రమంలో ఇబ్బంది పడుతున్న సాక్షికి భర్త సహకరించాడు. కూర్చుని, ఆమె కాళ్లకు అవి సరిపోయాయో లేదో స్వయంగా చూస్తూ కాళ్లకు తొడిగాడు.. అతనే స్వయంగా చెప్పుల బెల్టులు సర్దాడు.
