Bhavanam Venkatram Reddy: మాజీ సీఎం భవనం వెంకట్రామరెడ్డి కుమారుడు మృతి!

  • ఈ ఉదయం గుండెపోటుతో మృతి
  • సంతాపం తెలిపిన కాంగ్రెస్ నేతలు
  • నేడు మహాప్రస్థానంలో అంత్యక్రియలు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత భవనం వెంకట్రామరెడ్డి కుమారుడు, సన్ షైన్ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ గురవారెడ్డి బావమరిది భవనం శ్రీనివాస్ గుండెపోటుతో మరణించారు. ఆయన వయసు 57 సంవత్సరాలు. ఈ విషయాన్ని వెల్లడించిన కుటుంబ సభ్యులు, ఆదివారం సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్, జూబ్లీహిల్స్ లోని మహా ప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తామని తెలిపారు. భవనం శ్రీనివాస్ మృతి పట్ల ఆయన కుటుంబ సభ్యులకు పలువురు కాంగ్రెస్ నేతలు సంతాపం వెలిబుచ్చారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.

Bhavanam Venkatram Reddy
Bhavam Srinivas
Died
Heart Attack
  • Loading...

More Telugu News