Rahul Gandhi: చంద్రబాబు కీలక నిర్ణయం... కాంగ్రెస్ సీఎంల ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు!

  • రాహుల్ గాంధీ నుంచి ఆహ్వానం
  • మంత్రులను సలహా కోరిన చంద్రబాబు
  • విపక్షాలు ఐకమత్యంతో ఉన్నాయని చూపాలి
  • వెళితేనే మంచిదని మంత్రుల అభిప్రాయం

రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ సీఎంల ప్రమాణ స్వీకారోత్సవాలకు హాజరు కావాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. ఈ కార్యక్రమాలకు హాజరు కావాలని రాహుల్ గాంధీ సహా, సీఎం అభ్యర్థులంతా స్వయంగా కోరడంతో, వెళ్లాలా? వద్దా? అని మంత్రుల సలహాను చంద్రబాబు కోరిన సంగతి తెలిసిందే. దీనికి వెళ్లటమే సరైన నిర్ణయమని మంత్రులు అభిప్రాయపడగా, చంద్రబాబు ఆ మేరకు తన టూర్ ప్రోగ్రామ్ ను ఖరారు చేయాలని అధికారులకు ఆదేశించారు. బీజేపీకి వ్యతిరేకంగా, ప్రధాన ప్రతిపక్షాలన్నీ ఐకమత్యంతో ఉన్నాయన్న సంకేతాలు పంపాలంటే, చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమాలకు హాజరు కావాలని మంత్రులు సూచించారు.

వైఎస్ కారణంగానే పాతబస్తీలో అల్లర్లు జరిగాయని, ఎంతో మంది ముస్లింలు చనిపోయారని చెన్నారెడ్డి ఆరోపించిన విషయాన్ని గుర్తు చేసిన చంద్రబాబు, అటువంటి వైఎస్ కుటుంబ సభ్యులతో అసదుద్దీన్ కు ఎప్పుడు సత్సంబంధం ఏర్పడిందో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. కాగా, రేపు రాజస్థాన్ సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్న అశోక్ గెహ్లాట్, ఇప్పటికే చంద్రబాబుకు ఫోన్ చేసి ఆహ్వానించగా, రేపు ఆయన జైపూర్ వెళ్లనున్నట్టు తెలుస్తోంది.

Rahul Gandhi
Chandrababu
Rajasthan
Congress
Telugudesam
Oath
  • Loading...

More Telugu News