Spain: రూ.118 కోట్ల పన్ను ఎగవేసిన పాప్ సింగర్ షకీరా

  • షకీరాపై పన్ను ఎగవేత ఆరోపణలు
  • 11 నెలల క్రితమే విచారణకు ఆదేశం
  • బార్సెలోనాకు మకాం మార్చిన పాప్ సింగర్

కొలంబియన్ పాప్ సింగర్ షకీరాపై కేసు నమోదైంది. 14.5 మిలియన్ యూరోల (రూ.118 కోట్లు) పన్నును ఎగవేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న షకీరాపై తాజాగా స్పెయిన్‌లో అభియోగాలు నమోదయ్యాయి. షకీరా 2015లో తన నివాసాన్ని బహమాస్ నుంచి బార్సెలోనాకు మార్చింది. అక్కడామె తన భాగస్వామి, బార్సెలోనా ఫుట్‌బాల్ ఆటగాడు గెరార్డ్ పిక్‌తో కలిసి నివసిస్తోంది. వీరికి ఇద్దరు కుమారులున్నారు.

 2012 నుంచి 2014 వరకు షకీరా బార్సెలోనాలోనే నివసించింది. ఈ కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఇచ్చిన షోల ద్వారా సంపాదించిన మొత్తంలో పన్ను కట్టాల్సి ఉందని  ప్రాసిక్యూటర్లు పేర్కొన్నారు. షకీరా ఎక్కువ కాలం స్పెయిన్‌లో ఉందని, విదేశాల్లో అతి తక్కువ సమయం మాత్రమే ఉందని తెలిపారు. షకీరాపై నమోదైన అభియోగాలపై స్పందించేందుకు ఆమె ప్రతినిధులు నిరాకరించారు. షకీరా పన్ను ఎగవేత ఆరోపణలపై 11 నెలల క్రితమే న్యాయాధికారులు దర్యాప్తుకు ఆదేశించారు. తాజాగా అభియోగాలు నమోదయ్యాయి.

Spain
Colombian singer
Shakira
tax evasion
Barcelona
Bahamas
  • Loading...

More Telugu News