Arvind Kejriwal: మోదీ, అమిత్ షాలతో దేశానికి ప్రమాదం: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్

  • బీజేపీ ఓటమిపై కేజ్రీవాల్ స్పందన
  • వారిద్దరూ అత్యంత ప్రమాదకారులని ట్వీట్
  • మోదీ తిరోగమనం మొదలైందన్న సీఎం

ఇటీవల ఐదు రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ పరాజయం పాలవడంపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్పందించారు. ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షాలు దేశానికి అత్యంత ప్రమాదకరంగా తయారయ్యారని ఆరోపించారు.  భవిష్యత్తులో కూడా వారితో ప్రమాదం పొంచి ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో కనుక మరోమారు అధికారంలోకి వస్తే వారిని పట్టుకోవడం కష్టమని, రాజ్యాంగాన్ని కూడా వారు లెక్కచేయరని అన్నారు. అలా జరగకూడదనే కోరుకుంటున్నామని, అందుకోసం ప్రయత్నిస్తామని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. తాజా ఎన్నికల ఫలితాలు మోదీ తిరోగమనానికి సూచిక అని పేర్కొన్నారు.

Arvind Kejriwal
Narendra Modi
Amit Shah
New Delhi
BJP
  • Loading...

More Telugu News