Lagadapati Rajagopal: మొన్న మాట్లాడే తప్పు చేశా.. మళ్లీనా?: సర్వేపై లగడపాటి స్పందన

  • కుటుంబ సమేతంగా తిరుమలకు లగడపాటి
  • తిరుపతిలో రాజకీయాలు మాట్లాడనన్న మాజీ ఎంపీ
  • ఆ రోజే మాట్లాడి తప్పు చేశానని పశ్చాత్తాపం

తెలంగాణ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో ప్రజాకూటమి విజయం సాధిస్తుందని తన సర్వేలో తేలిందని చెప్పి అభాసుపాలైన విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ శనివారం కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్బంగా విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పేందుకు ఆయన నిరాకరించారు. ముఖ్యంగా తెలంగాణ ఎన్నికల ఫలితాలు, తన సర్వేపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు దాటవేశారు.

రాజకీయాల గురించి తిరుపతిలో మాట్లాడకూడదని అనుకుంటూనే మొన్న మాట్లాడేశానని, అదే పెద్ద పొరపాటైందని అన్నారు. నిజానికి తిరుపతిలో తానెప్పుడూ రాజకీయాల గురించి మాట్లాడనని, కానీ మొన్న మీ అందరినీ చూసి ఆగలేక మాట్లాడేశానని అన్నారు. ఆ రోజు మాట్లాడడమే పొరపాటైందని, మళ్లీ ఇప్పుడు ఆ విషయాన్ని ప్రస్తావించి మరో పొరపాటు చేయబోనని చెబుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Lagadapati Rajagopal
Tirumala
Telangana
Survey
Andhra Pradesh
  • Error fetching data: Network response was not ok

More Telugu News