beauty parlour: మలయాళ సినీ నటి లీనా పాల్‌పై కాల్పులు.. అండర్ వరల్డ్ పనేనంటున్న పోలీసులు!

  • నటికి చెందిన బ్యూటీ పార్లర్ వద్దే కాల్పులు
  • అండర్ వరల్డ్‌తో విభేదాలే కారణమన్న పోలీసులు
  • నటిపై గతంలో పలు చీటింగ్ కేసులు

మలయాళ సినీ నటి, మోడల్ లీనా పాల్‌పై బైక్‌పై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. కొచ్చిలోని పానంపిల్లీలో ఉన్న నటికి చెందిన బ్యూటీ పార్లర్ వద్ద శనివారం మధ్యాహ్నం 3:45 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు. కాల్పులు జరిపిన అనంతరం దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు.

పోలీసుల కథనం ప్రకారం.. ఈ ఘటన జరిగినప్పుడు నటి బ్యూటీ పార్లర్ ‘నెయిల్ ఆర్టిస్ట్రీ’ పార్లర్ రద్దీగా ఉంది. దుండగులు లోపలికి వెళ్లకుండా బయటి నుంచే కాల్పులు జరపడంతో ఎవరూ గాయపడలేదని పోలీసులు తెలిపారు. అండర్ వరల్డ్‌తో ఆర్థిక పరమైన అంశాల్లో విభేదాలే ఈ ఘటనకు కారణంగా తెలుస్తోందని పేర్కొన్నారు.

బైక్‌పై వచ్చిన దుండగులు ఎయిర్ గన్స్ ఉపయోగించినట్టు పోలీసులు తెలిపారు. పార్లర్ వద్ద, ఆ చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు  స్వాధీనం చేసుకున్నారు. లీనాపై వివిధ నగరాల్లో చీటింగ్ కేసులు కూడా ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

లీనా, ఆమె పార్ట్‌నర్ శేఖర్ చంద్రశేఖర్‌లను జూన్ 2015లో ఎకనమిక్ అఫెన్స్ వింగ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్వెస్టర్లకు 10 రెట్లు అధికంగా చెల్లిస్తానని చెప్పి డబ్బు దండుకుని మోసం చేసిన కేసులో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. 2013లో లీనా, ఆమె అప్పటి భాగస్వామి బాలాజీ‌లు చెన్నైలోని ఓ ప్రైవేటు బ్యాంకును రూ.19 కోట్ల మేర మోసం చేసిన కేసులో ఢిల్లీ, చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు.

beauty parlour
Leena Paul
Panampilly Nagar
Kochi
shooting
Actress
  • Loading...

More Telugu News