KTR: కేటీఆర్ బాధ్యతల స్వీకరణకు ముహూర్తం ఖరారైంది: పల్లా రాజేశ్వర్ రెడ్డి

  • ఎన్నికల్లో ఉత్సాహంగా పనిచేయాలి
  • ఏకగ్రీవం అయ్యేలా చూడాలి
  • ఓటుహక్కును నమోదు చేసుకోవాలి

టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేత కేటీఆర్‌ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. నేడు తెలంగాణ భవన్‌లో 62 మంది ప్రతినిధులతో పార్టీ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానంతరం టీఆర్ఎస్ పార్టీ నేత పల్లా రాజేశ్వరరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సోమవారం ఉదయం 11:05 గంటలకు కేటీఆర్ బాధ్యతలు స్వీకరిస్తారని ఆయన తెలిపారు.

జనవరిలో జరిగే పంచాయతీ ఎన్నికల్లో కార్యకర్తలు ఉత్సాహంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. మార్చి నుంచి పార్లమెంట్ నియోజకవర్గాలకు జనరల్ సెక్రటరీ, ఇద్దరు సెక్రటరీలను నియమించనున్నట్టు తెలిపారు. వీలైనంత వరకూ పంచాయతీలను ఏకగ్రీవం చేసేలా చూడాలన్నారు. అర్హత ఉన్నవారంతా ఓటు హక్కును నమోదు చేసుకోవాలని రాజేశ్వరరెడ్డి సూచించారు.

KTR
Palla Rajeswar Reddy
Telangana
Vote
Parliament constency
  • Loading...

More Telugu News