Saina Nehwal: సైనా, కశ్యప్‌లకు శుభాకాంక్షలు చెప్పే క్రమంలో తప్పులో కాలేసిన సచిన్

  • వివాహ బంధంతో ఒక్కటైన సైనా, కశ్యప్
  • శ్రీకాంత్, సైనాల ఫోటోను షేర్ చేసిన సచిన్
  • విషయాన్ని వెల్లడించిన నెటిజన్లు

సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్‌లు నిన్న వివాహ బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. ఈ జంటకు శుభాకాంక్షలు చెప్పే క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తప్పులో కాలేశారు. సైనా, కశ్యప్‌లకు బదులు.. కిడాంబి శ్రీకాంత్, సైనాల ఫోటోను ట్విట్టర్‌లో షేర్ చేసి... సచిన్ వివాహ శుభాకాంక్షలు తెలిపారు. విషయాన్ని గమనించిన నెటిజన్లు  పొరబడ్డారని వెల్లడిస్తూ కామెంట్లు పెట్టారు. దీంతో తప్పు తెలుసుకున్న సచిన్ వెంటనే తన ట్వీట్‌ను డిలీట్ చేశారు. అయితే అదే ఫోటోను మరోపక్క శ్రీకాంత్ పోస్ట్ చేసి, నూతన వధువరులకు వివాహ శుభాకాంక్షలు తెలిపారు.

Saina Nehwal
Parupalli Kasyap
Sachin Tendulkar
Kidambi Srikanth
Twitter
  • Loading...

More Telugu News