KCR: కేసీఆర్ ప్రత్యేక హోదా ఉద్యమానికి నాయకత్వం వహించాలి: కేతిరెడ్డి

  • స్వార్థ రాజకీయాల వల్ల బలవుతోంది
  • నూతన నాయకత్వానికి కృషి చేయాలి
  • దేశానికి కేసీఆర్ నాయకత్వం అవసరం

ప్రత్యేక హోదా ఉద్యమం... స్వార్థ రాజకీయాల కారణంగా బలవుతోందని.. కాబట్టి తెలంగాణ సీఎం కేసీఆర్ నాయకత్వం వహించి ఏపీ ప్రజల కలను సాకారం చేయాలని తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి కోరారు. నేడు కేసీఆర్‌ని కలిసిన కేతిరెడ్డి ముందస్తు ఎన్నికల్లో అద్భుత విజయం సాధించినందుకు శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం కేతిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో కేసీఆర్.. దేశంలో నూతన నాయకత్వానికి కృషి చేస్తే ఆయన వెంట నడిచేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. జయలలిత, కరుణానిధి మరణం తర్వాత దక్షిణాదిలో పోరాటపటిమ ఉన్న నాయకుల లేమి ఉందన్న కేతిరెడ్డి... ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి కేసీఆర్ నాయకత్వం చాలా అవసరమన్నారు. ప్రత్యామ్నాయ పార్టీలు లేకపోవడంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దేశాన్ని శాసిస్తున్నాయని, నూతన బలమైన నాయకత్వం ఉంటే ప్రజలందరూ ఆ నాయకుడి వెంట నడుస్తారని స్పష్టం చేశారు.
                                                                             
 

KCR
Kethireddy Jagadeeswar Reddy
Andhra Pradesh
Special Status
Jayalalitha
Karunanidhi
  • Loading...

More Telugu News